Page Loader
IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని 
సీఎస్కే తరుపున 4500 పరుగులు చేసిన ఎంఎస్ ధోని

IPL 2023: సీఎస్కే తరుపున మరో రికార్డును సాధించిన ఎంఎస్ ధోని 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2023
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాకు రెండు ప్రపంచ్ కప్ లు అందించిన కెప్టెన్, అతడి సారథ్యంలో 2013లో ఛాంపియన్ ట్రోఫీని సైతం టీమిండియా గెలుచుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకరు. చైన్నై సూపర్ కింగ్స్ కు నాలుగు టైటిల్స్ అందించిన నాయకుడు. ప్రస్తుతం ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సీఎస్కే తరుపున 4500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు సురేష్ రైనా పేరిట ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ మైలురాయిని ధోని అందుకున్నాడు.

Details

ఐపీఎల్ లో 5వేల పరుగుల మార్కును దాటిన ధోని

సీఎస్కే తరుపున ధోని 22 అర్ధ సెంచరీలను బాదాడు. ఇక సురేష్ రైనా సీఎస్కే తరుపున రైనా 32.32 సగటుతో 4,687 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై గతంలో రైనా 661 పరుగులు సాధించగా.. ఇప్పుడు ధోని 31.76 సగటుతో 667 పరుగులు చేసి రైనా రికార్డును అధిగమించాడు. ఈ సీజన్ ప్రారంభంలో, ధోని ఐపీఎల్‌లో 5,000 పరుగుల మార్క్‌ను అధిగమించిన ఐదవ టీమిండియా బ్యాటర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో మొత్తం 246 ఇన్నింగ్స్ లు ఆడి 39.33 సగటుతో 5,074 పరుగులను పూర్తి చేశాడు.