NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 
    మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 
    క్రీడలు

    మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2023 | 04:47 pm 0 నిమి చదవండి
    మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఎంఎస్ ధోని.. ఆస్కార్ విన్నర్స్ కు జెర్సీ అందజేత 
    జెర్సీని అందజేస్తున్న ఎంఎస్ ధోని

    టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ ఆస్కార్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచిన బొమ్మన్, బెల్లీలకు ఎంఎస్ ధోని తన ఏడో నంబర్ జెర్సీని గిఫ్ట్ గా అందజేశారు. మే9న చైన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ నిర్వహించిన అనంతరం ధోని ప్రత్యేక ఈవెంట్లో ఈ జెర్సీలను అందజేయడం విశేషం. వారితో పాటు ఎలిఫెంట్ విస్పరన్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కార్తీకి గోన్జాల్వెస్ కు కూడా ధోని తన జెర్సీని అందజేసి పెద్ద మనసును అందజేశాడు. ఈ డాక్యుమెంటరీ ద్వారా ఈ ఇద్దరూ ఆనాథలైన ఏనుగుల సంరక్షణ ఎలా చేపడతారో కళ్లకు కట్టినట్లు చూపించాడు.

    నేడు ఢిల్లీతో తలపడనున్న చైన్నై సూపర్ కింగ్స్

    ఏనుగుల సంరక్షణ కోసం ముడుమలై టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కు విరాళం కూడా ఈ మధ్య అందిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడుకు చెందిన వీళ్లు తమ డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉందని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే చైన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. నేడు సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలుపు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, చైన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి.

    ఆస్కార్ విన్నర్స్ కి జెర్సీ అందజేస్తున్న ధోని 

    Roars of appreciation to the team that won our hearts! 👏

    So good to host Bomman, Bellie and filmmaker Kartiki Gonsalves! 🐘#WhistlePodu #Yellove 🦁💛

    — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఎంఎస్ ధోని
    ఐపీఎల్

    ఎంఎస్ ధోని

    ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయాన్ని బయటపెట్టిన సురేష్ రైనా ఐపీఎల్
    ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్ వీరేంద్ర సెహ్వాగ్
    ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని ఐపీఎల్
    ధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్ చైన్నై సూపర్ కింగ్స్

    ఐపీఎల్

    IPL 2023 : శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఇదే!  కోల్‌కతా నైట్ రైడర్స్
    అత్యంత చెత్త రికార్డును నమోదు చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
    CSK vs Dc ఢిల్లీ ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. గెలవాల్సిందే! ఢిల్లీ క్యాపిటల్స్
    సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం  ముంబయి ఇండియన్స్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023