ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఈ విషయంపై ధోని స్పందించి సమాధానం ఇచ్చాడు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా ధోనికి మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. అయితే రిటైర్మెంట్ పై ధోనిని పదే పదే ప్రశ్నించడంపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. హోస్ట్ డానీ మోరిసన్.. ధోని రిటైర్మెంట్ గురించి అడిగాడు. ఇదే చివరి సీజన్ కదా.. మీకు ఎలా అనిపిస్తోంది అని ధోనిని అడగ్గా.. ఇందుకు ధోని తనదైన స్ట్రైల్లో సమాధానం ఇచ్చాడు. ఇదే చివరి సీజన్ అని మీరు డిసైడ్ అయ్యారు.. నేను కాదంటూ బదులిచ్చాడు.
రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టం
ధోనిని రిటైర్మెంట్ గురించి ఎందుకు అడుగుతున్నారని, రిటైర్మెంట్ అనేది ధోని ఇష్టమని, అతను ఏదైనా చెప్పాలనుకుంటే అభిమానుల అందరికీ తెలియజేస్తాడని, అయితే ధోనికి ఇది చివరిదో కాదో అతడికి మాత్రమే తెలుసని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే లక్నో సూపర్ జెయింట్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దుయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ఫలితం రాలేదు. దీంతో అంపైర్లు చైన్నై, లక్నో జట్టుకు చెరో పాయింట్ ను ఇచ్చారు.