ఇది నా చివరి ఐపీఎల్ కాదు : ఎంఎస్ ధోని
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టాస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై ధోని ఎటువంటి ప్రకటన చేయలేదు. లక్నోతో జరిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం కామెంటర్ డానీ మోరిసన్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనిని ఉద్ధేశించి మీరు మీ చివరి సీజన్ ఐపీఎల్ ను ఎలా ఎంజాయ్‌చేస్తున్నారు అని డానీ మోరిసన్ ఆడిగాడు.
డానీ మోరిసన్ వ్యాఖ్యలపై ధోని స్పందన
డానీ మోరిసన్ వ్యాఖలపై ధోని ధోని తనదైన స్ట్రైల్ లో సమాధానం చెప్పాడు. ఇదే తన చివరి సీజన్ అని మీరు నిర్ణయించుకున్నారని, తాను ఇంకా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని ధోని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ధోని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మాటలు విన్న ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ధోని సారథ్యంలో చైన్నై ఈ సీజన్లో 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలను నమోదు చేసింది.