చైన్నై వర్సెస్ లక్నో.. గెలుపుపై ఇరు జట్లు ధీమా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఆటల్ బిహారి వాజ్ పేయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు మధ్య రెండు మ్యాచులు జరిగాయి. 2022లో జరిగిన మ్యాచ్ లో లక్నో గెలిస్తే.. ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్ లో 12 రన్స్ తేడాతో చైన్నై గెలుపొందింది. గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిన చైన్నై ఈసారి లక్నోపై విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోపక్క సొంతమైదానంలో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైన లక్నో.. చైన్నైని ఓడించి విజయాల బాట పట్టాలని కసితో ఉంది.
ఇరు జట్లలోని సభ్యులు
లక్నో, చైన్నై తొమ్మిది మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించి వరుసగా మూడు, నాలుగో స్థానంలో నిలిచాయి. చెన్నై బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండటంతో లక్నో బౌలర్లు వారిని ఏ విధంగా కట్టడి చేస్తారో వేచి చూడాలి లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (సి), స్టోయినిస్, యశ్ ఠాకూర్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతం, నికోలస్ పూరన్ (వికెట్), రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, నవీన్-ఉల్-హక్ చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాయుడు, రహానే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, MS ధోని (c & wk), తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరణ/మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ