ఓడినా అగ్రస్థానంలోనే గుజరాత్.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్వల్ప మార్పులివే
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ చేధించలేకపోయింది. దీంతో హార్ధిక్ సేన్ 125/6 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో ఢిల్లీ మూడో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓడినా.. పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. 9 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో వరుసగా లక్నో, చైన్నై, బెంగుళూర్, పంజాబ్ తర్వాతి స్థానాలో ఉన్నాయి.
ఆరెంజ్ క్యాప్ లీడ్ లో డుప్లెసిస్
మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్ లో 3 విజయాలు సాధించి 6 పాయింట్లతో 10 స్థానంలోనే కొనసాగుతోంది. ఇక ఈ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ ను డుప్లెసిస్ సొంతం చేసుకున్నాడు. 9 మ్యాచ్ ల్లో 466 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యశస్వీ జైస్వాల్ 428 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయంలో మహ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. 9 మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి ముందంజలో నిలిచాడు. అతడి తర్వాతి స్థానంలో తుషార్ దేశ్ పాండే కూడా 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 15 వికెట్లతో వరుసగా సిరాజ్, రషీద్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ తదుపరి స్థానంలో నిలిచాడు.