LOADING...
DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు 
DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు

DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్‌ లక్ష్యం 131 పరుగులు 

వ్రాసిన వారు Stalin
May 02, 2023
09:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌‌ అద్భుతంగా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా మహ్మద్ షమీ విజృంభించాడు. 4వికెట్లు తీసుకొని దిల్లీ టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి దిల్లీ స్కోరు 28/5 ఉందంటే షమీ ఎలా బాల్‌తో నిప్పులు చెరిగాడో అర్థం అవుతుంది. ఆఖర్లో అమన్ హకిమ్ 51పరుగులు చేయడంతో దిల్లీ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. గుజరాత్ జట్టుకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గజరాత్ టార్గెట్ 131 పరుగులు