Loading...
BCCI: ఐపీఎల్‌ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్‌ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!

BCCI: ఐపీఎల్‌ ఒత్తిడే టీమిండియా ఆటగాళ్ల గాయాలకు కారణమా? బీసీసీఐ వర్గాల సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2026
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాలో వరుసగా చోటుచేసుకుంటున్న గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభానికి ముందు పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ హర్షిత్‌ రాణా, బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లో గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడంలో ఆలస్యం జరుగుతోందన్న విమర్శలపై సీఓఈ అధిపతి, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందించారు. ఆటగాళ్లు పూర్తిగా కోలుకునేందుకు ముందుగా అంచనా వేసిన సమయానికే తప్పనిసరిగా రికవరీ అవుతారని చెప్పలేమని స్పష్టం చేశారు.

వివరాలు

గాయం తీవ్రతను బట్టే రికవరీ

గాయం తీవ్రత, చికిత్సకు ఆటగాడి శరీరం స్పందించే విధానాన్ని బట్టి రికవరీ ప్రక్రియలో మార్పులు చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.

ఒక ఆటగాడు కోలుకునే సమయం మరొకరితో సమానంగా ఉండదని, పరిస్థితిని బట్టి చికిత్స, శిక్షణ విధానాలను మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వివరాలు

ఐపీఎల్‌ ఒత్తిడిపై ఆందోళన

మరోవైపు ఆటగాళ్ల వరుస గాయాలకు ఐపీఎల్‌లో ఉండే ఒత్తిడి కూడా ఒక కారణంగా మారుతోందని సీఓఈ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల ఒత్తిడి, ఆర్థిక అంశాల కారణంగా కొందరు ఆటగాళ్లు గాయాలున్నప్పటికీ మ్యాచ్‌లు ఆడుతున్నారని సీఓఈకి చెందిన ఓ కీలక అధికారి తెలిపినట్లు సమాచారం.

గాయాల నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొన్న కొందరు ఆటగాళ్లు.. ఆ తర్వాత అదే గాయాలతో జాతీయ జట్టులోకి వస్తున్నారని ఆ అధికారి ఆరోపించినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

వరుస క్రికెట్‌తో శరీరంపై భారం

ఏడాది పొడవునా వరుసగా ఎక్కువ క్రికెట్‌ ఆడటం వల్ల ఆటగాళ్ల శరీరంపై భారం పెరుగుతోందని సీఓఈ అధికారి పేర్కొన్నారు.

ముఖ్యంగా వయసు పెరిగిన ఆటగాళ్లు గాయాల నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో ముందుగానే కచ్చితంగా చెప్పడం మరింత కష్టమవుతోందని తెలిపారు. అయితే ఆటగాళ్ల విషయంలో సీఓఈ ఫిజియోలు, భారత జట్టు ఫిజియోలు భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ అధికారి స్పష్టం చేశారు.

ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని వైద్య బృందం నిర్ధారించిన తర్వాతే తిరిగి మైదానంలోకి పంపే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

దీని కారణంగా కొన్ని సందర్భాల్లో సెలెక్టర్లు, కోచ్‌లు, కెప్టెన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

ADVERTISEMENT