Page Loader
ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?
టీమిండియాలోని జట్టు సభ్యులు

ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2023
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన రోహిత్ సేన.. యూఏఈలో జరిగిన ఆసియా కప్‌‌లో ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డ మీద శ్రీలంకపై టెస్టు సిరీస్ గెలిచిన భారత్.. టెస్టు ర్యాకింగ్‌లో రెండోస్థానంలో ఉంది. సీనియర్ ఆటగాళ్లకు గాయాలు, విశ్రాంతి కారణంగా 2022లో అశించిన మేర రాణించలేదు. ప్రస్తుతం కొత్త ఏడాదిలో సత్తా చాటాలని భావిస్తోంది టీమిండియా.. 2023లో భారత జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే పర్యటించనుంది. రేపు భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు.

భారత జట్టు

టీమిండియా షెడ్యూల్ ఇదే..

జనవరి : సొంత గడ్డపై శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్. జనవరి-ఫిబ్రవరి: సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్. ఫిబ్రవరి-మార్చి: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, 3 వన్డేల సిరీస్ జులై-ఆగస్టు: వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు (వెస్టిండీస్‌లో) సెప్టెంబర్ : సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ అక్టోబర్: వన్డే వరల్డ్ కప్‌కి ఆతిథ్యం నవంబర్: సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ డిసెంబర్-జనవరి 2024: దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు