LOADING...
T20 World Cup: దుమ్మురేపిన వెస్టిండీస్.. ఓటమితో టోర్నీకి గుడ్‌బై చెప్పిన ఇటలీ
దుమ్మురేపిన వెస్టిండీస్.. ఓటమితో టోర్నీకి గుడ్‌బై చెప్పిన ఇటలీ

T20 World Cup: దుమ్మురేపిన వెస్టిండీస్.. ఓటమితో టోర్నీకి గుడ్‌బై చెప్పిన ఇటలీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ లీగ్‌ దశను అజేయంగా ముగించింది. కోల్‌కతా వేదికగా గ్రూప్‌-సీలో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇటలీపై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ జట్టుకు కెప్టెన్‌ షాయ్ హోప్ 46 బంతుల్లో 75 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. అతనికి తోడుగా రూథర్‌ఫోర్డ్ 15 బంతుల్లో 24 నాటౌట్‌గా మెరుపులు మెరిపించాడు. దీంతో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ పేసర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

Details

హోప్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు

షమర్ జోసెఫ్ 4/30తో నాలుగు వికెట్లు పడగొట్టగా, మాథ్యూ ఫోర్డ్ 3/19తో కీలక పాత్ర పోషించాడు. వారి దూకుడుకు ఇటలీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇటలీ తరఫున బెన్ మనేంటి 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారీ ఆశల మధ్య తొలిసారి ఈ టోర్నీకి అర్హత సాధించిన ఇటలీ జట్టు ఓటమితో తమ ప్రయాణాన్ని ముగించింది. అద్భుత కెప్టెన్సీ ఇన్నింగ్స్‌కు గాను హోప్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Advertisement