
జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆడటానికి చూస్తే పళ్లు రాలిపోతాయి
ఈ వార్తాకథనం ఏంటి
గవాస్కర్ టోఫ్రీలో భాగంగా టీమిండియా 2-0 ఆధిక్యంలో కొసాగుతోంది. టీమిండియా విజయంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. రెండో టెస్టులో వీరిద్దరూ ఏకంగా 16 వికెట్లు తీసి సత్తా చాటారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసీస్ పై అదిరిపోయే పంచ్ విసిరాడు. తాజాగా జాఫర్ చేసిన పోస్టు సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఎలా ఇబ్బంది పడ్డారో చమత్కారంగా తెలియజేసే వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో ఆసీసీ కేవలం గంటన్నర వ్యవధిలోనే ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
రవీంద్ర జడేజా
మార్చి 1న మూడో టెస్టు
జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆడాలని ప్రయత్నిస్తే పళ్లు రాలిపోతాయని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పేర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్ లో వారి ఇద్దరు పది వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 113 పరుగులకే కుప్పకూలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-0 తేడాతో అధిక్యంలో ఉంది.
అయితే మూడో టెస్టు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మార్చి 1న జరగనుంది.