Page Loader
వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం
వన్డే జట్టుకు దూరమైన బుమ్రా

వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో టీ20 సిరీస్ సాధించి, మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా అనివార్య కారణాలతో ఈ సిరీస్ దూరమయ్యాడు. బూమ్రా రీఎంట్రీ విషయంలో బిసీసీఐ యూటర్న్ తీసుకుంది. భవిష్యత్ టోర్నిల నేపథ్యంలో బుమ్రాను పక్కకు పెట్టినట్లు సమాచారం. గాయం కారణంగా సీనియర్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. తొలుత వన్డే టోర్నికి ఉంటాడని మొదట్లో బీసీసీఐ ప్రకటించగా.. ఆస్ట్రేలియా, WTC, వన్డే ప్రపంచ కప్ వంటి ముఖ్యమైన టోర్నీలు భారత్ కు ఉన్నందున బుమ్రాను శ్రీలంక వన్డే సిరీస్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్

శ్రీలంకతో జరిగే వన్డేలకు భారత జట్టు ఇదే..

బుమ్రాకు మరికొంత సమయం ఇవ్వాలని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) సిబ్బంది సిఫార్సు చేసినట్లు సమాచారం బుమ్రా రాబోయే న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, టీ20 సిరీస్ లకు అందుబాటులో ఉండొచ్చు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ మరియు అర్ష్దీప్ సింగ్.