కేఎల్ రాహుల్ గాయంపై కీలక అప్డేట్.. సర్జరీ సక్సెస్
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తన గాయంపై కీలక ఆప్డేట్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ తొడ కండరాలకు గాయమైంది. ఈ గాయం తర్వాత అతను ఐపీఎల్ లో బరిలోకి దిగలేదు.
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఐపీఎల్ మొత్తానికి కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. వచ్చే నెలలో జరిగే డబ్య్లూటీసీ ఫైనల్ లో తాను ఆడడం లేదని కీలక ప్రకటన చేశాడు.
అయితే బుధవారం జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, వీలైనంత త్వరగా మైదానంలోకి రావాలని ఎదురుచూస్తున్నానని కేఎల్ రాహుల్ పేర్కొన్నారు.
Details
కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్
సర్జరీ సజావుగా జరిగినందుకు వైద్యులు, వైద్య సిబ్బందికి కేఎల్ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. శస్త్ర చికిత్స తర్వాత తాను క్షేమంగా ఉన్నానని రాహుల్ వివరించారు. అయితే కేఎల్ రాహుల్ త్వరగా కోలుకోవాలని సునీల్ శెట్టి, అతియా ఆకాంక్షించారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
కేఎల్ రాహుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు కేఎల్ రాహుల్ అవసరం చాలా ఉందని, అతను ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
డబ్య్లూటీసీ ఫైనల్లో కేఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఇంగ్లండ్ కు పంపుతున్నట్లు బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.