టాప్ -3 కి చేరుకున్న రోహిత్ సేన.. దిగజారిన ఆర్సీబీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 11 మ్యాచ్ లు ఆడేశాయి.
ప్లేఆఫ్ కు అర్హత సాధించడానికి చాలా జట్లు పోటీపడుతున్నాయి. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో రెండుస్థానాలు దిగజారి, ఏడో స్థానానికి చేరుకుంది.
ఇక అద్భుత విజయాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్ టాప్ -4లోకి ప్రవేశించడం విశేషం. దీంతో ఫ్లే ఆఫ్ రేసు ఆసక్తిగా మారింది.
గుజరాత్ 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ ల్లో నాలుగు ఓటములు, 6 విజయాలను సాధించింది. మరోమ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ లభించింది.13 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది.
Details
ఆరెంజ్ క్యాప్ లీడ్ లో డుప్లెసిస్
ముంబై ఇండియన్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 విజయాలు, 5 ఓటములతో 3వ స్థానంలో నిలిచింది. లక్నో 11 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి 4 స్థానానికి చేరింది.
ఆరెంజ్ క్యాప్ విషయానికొస్తే.. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అగ్రస్థానంలో నిలిచాడు. 11మ్యాచ్ ల్లో 576 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు.
జైస్వాల్(477), శుభ్ మాన్ గిల్ (469), కాన్వే (458) పరుగులతో వరుసగా తర్వాతి స్థానంలో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ లీడ్ లో మహ్మద్ షమీ నిలిచాడు.
ఇప్పటివరకూ 19 వికెట్లు తీసి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రషీద్ ఖాన్, దేశ్ పాండే 19 వికెట్లు సాధించినా యావరేజ్ కారణంగా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.