Page Loader
సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం 
సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం

సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం 

వ్రాసిన వారు Stalin
May 09, 2023
11:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. సిక్సులు,ఫోర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. మరోవైపు వధేరా హాఫ్ సెంచరీ(52)తో రెచ్చిపోయాడు. ఫలితంగా 200పరగులు లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబయి ఇండియన్స్‌ మూడు ఓవర్లు, మూడు బాల్స్ మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. సూర్య 237.14 స్ట్రైక్ రేటుతో ఆడాటంటే ఏ రేంజ్‌లో బ్యాటింగ్ చేసి ఉంటాడో ఊహించనక్కర్లలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆర్‌సీబీ 199 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ముంబయి జట్టు 16.3ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ముంబయికి మంచి ఆరంభాన్ని ఇవ్వగా, వధేరా విన్నింగ్ షాట్ సిక్స్ కొట్టి ముంబయికి విజయాన్ని అందించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

6వికెట్ల తేడాతో ముంబయి విజయం