హాఫ్ సెంచరీతో టీమిండియాను గట్టెక్కించిన కేఎల్ రాహుల్
టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ గెలుపులో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ ప్రముఖ పాత్ర పోషించాడు. భారత్ కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో రాహుల్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కేఎల్ రాహుల్ హార్ధిక్ పాండ్యాతో కలిసి 75 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒక పక్క వికెట్లు పడిపోతున్నా రాహుల్ ఎంతో జాగ్రత్తగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నం చేశాడు. 64 పరుగులు చేసి, తన కెరియర్లో 12 వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. శ్రీలంకతో మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేయడం గమనార్హం. రాహుల్ గతంలో శ్రీలంకపై ఒక సెంచరీని కూడా చేశాడు.
కుల్దీప్‌కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
రాహుల్ ప్రస్తుతం 43.88 సగటుతో 1,799 పరుగులు చేశాడు. రాహుల్ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్ గెలుపును అందుకొని సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొదటి వన్డేలో రాణించినా రాణించినా రోహిత్, గిల్, కోహ్లీ విఫలం కావడంతో భారత్ కష్టాలో పడింది. ఈ క్రమంలో క్రీజులో వచ్చినా కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడాడు. హార్ధిక్ పాండ్యాత కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు కుల్దీప్, సిరాజ్ మూడు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. అనంతరం ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కుల్దీప్ ఎంపికయ్యాడు.