Page Loader
డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే!
గెలుపొందిన జట్టుకు అందజేయనున్న గద

డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో గెలుపొందిన జట్టుకు ఐసీసీ 'గద'తో పాటు భారీ ప్రైజ్ మనీని అందిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో టీమిండియాపై న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కు ఐసీసీ ఓ గదతో పాటు భారీ ప్రైజ్ మనీని అందించింది. సాధారణంగా మెగా టోర్నీలో గెలిచిన జట్టుకు కప్పును అందజేస్తారు. కానీ అప్పట్లో వినూత్నంగా గదను అందజేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభమైంది. ఈసారి టీమిండియా గదను దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ గద గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.

Details

2000 సంవత్సరంలోనే గదను రూపొందించిన ట్రావెర్ బ్రైన్

గతంలో టెస్టులో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు గదను అందజేశారు. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతకు అందిస్తున్నారు. అదే విధంగా జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు అందనున్నాయి. ట్రావెర్ బ్రైన్ అనే డిజైనర్ 2000 సంవత్సరంలోనే గదను రూపొందించారు. గద హ్యాండిల్ క్రికెట్ స్టంప్‌ను, హ్యాండిల్ చుట్టూ ఉండే రిబ్బన్ విజయానికి చిహ్నమని ట్రావెర్ బ్రైన్ తెలియజేశారు. విజేతగా నిలిచిన జట్టు సభ్యులు స్టంప్ ను తీసుకొని సంబరాలు చేసుకోవడం చూశానని, దీంతో స్టంప్ ను ఆలంబనగా చేసుకొని గదను తయారు చేయడానికి స్ఫూర్తి పొందానని ట్రైవెర్ బ్రైన్ చెప్పుకొచ్చాడు.