Page Loader
రోహిత్ సేనను అడ్డుకునేందుకు ఆసీస్ కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్ కోచ్
అండ్లీ ఫ్లవర్

రోహిత్ సేనను అడ్డుకునేందుకు ఆసీస్ కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్ కోచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

లండన్ లోని ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచుతో పాటు త్వరలో ఇంగ్లాండ్ తో జరిగే యాషెస్ సిరీస్ కోసం తమ జట్టు బ్యాక్ రూమ్ కన్సల్టెంట్ గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ప్లవర్‌ను నియమించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకొనేందుకు కంగారులు ఏ అవకాశాన్ని వదలుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ ఫైనల్‌లో రోహిత్ సేనను ఓడించేందుకు అన్ని మార్గాలను ఆసీస్ అన్వేషిస్తోంది. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితుల్లో కోచ్‌గా, డైరెక్టర్ గా ప్లవర్ కు అపారమైన అనుభవం ఉండడం విశేషం.

Details

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇరు జట్లలోని సభ్యులు!

2009 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా ఆండీ ప్లవర్ బాధ్యతలు నిర్వహించాడు. అంతకంటే ముందు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు డైరక్టర్‌గా పనిచేశాడు. అతను హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టును ఓడించి 3 సార్లు యాషెస్ విజేతగా నిలిచింది. అటు ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో జట్టుకు హెడ్‌కోచ్‌గా ప్లవర్ పనిచేశాడు. ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్, బోలాండ్, అలెక్స్ కారీ, గ్రీన్, మార్కస్ హారిస్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఖవాజా, లాబుస్‌చాగ్నే, లియోన్, మర్ఫీ, స్మిత్, మిచెల్ స్టార్క్, వార్నర్ భారత జట్టు: రోహిత్, గిల్, పుజారా, కోహ్లీ, రహానే, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, శార్దూల్, షమీ, సిరాజ్, ఉనద్కత్, ఉమేష్‌యాదవ్, ఇషాన్‌కిషన్