రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ
రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ బొటన వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. మంగళవారం నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ శర్మ గాయపడినట్లు సమాచారం. వెంటనే డాక్టర్లు వైద్య సాయం అందించారు. చేతికి బ్యాండెజీ వేసుకున్న తర్వాత రోహిత్ తిరిగి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొనున్నట్లు సమాచారం. దీంతో గాయం తీవ్రత పెద్దది కాదని అర్ధమవుతోంది. అయితే రోహిత్ గాయం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఇంగ్లాండ్ లో రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు
రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ కు రోహిత్ అందుబాటులో ఉండాలని టీమిండియా అభిమానులు కోరుతున్నారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా రాణించి టీమిండియాకు పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంగ్లాండ్ లో రోహిత్ శర్మకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అక్కడ అడిన 5 టెస్టుల్లో 402 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రస్తుతం జరుగే ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ పై 2021లో రోహిత్ 127 పరుగులు చేశాడు.