ధోనీకి క్రెడిట్ ఇస్తారు కానీ.. రోహిత్‌కు ఇవ్వరు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారిథి రోహిత్ శర్మ కెప్టెన్సీకి గుర్తింపు లభించడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
మైదానంలో ఏం జరిగినా చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి క్రెడిట్ ఇస్తారని, అయితే రోహిత్ ను మాత్రం పట్టించుకోలేదన్నారు.
ఇండియా టుడే తో రోహిత్-ధోనీ కెప్టెన్సీపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో పూరన్ ను ఔట్ చేయడానికి రోహిత్ వేసిన ఎత్తుగడ అద్భుతమని కొనియాడారు.
ఈ మ్యాచులో ఆకాష్ మధ్వాల్ ఐదు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. దీని వెనుక రోహిత్ వ్యూహాలను ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
Details
రోహిత్ కెప్టెన్సీ అద్భుతం
ఆయుష్ బదోనిని ఓవర్ ద వికెట్ చేస్తూ ఆకాష్ ఔట్ చేశాడు. అయితే లెఫ్ట్ హ్యాండర్ పూరన్ రాగానే అరౌండ ద వికెట్ బౌలింగ్ చేయడంతో పూరన్ ఔట్ అయ్యాడు.
ఓవర్ ద వికెట్లో బాగా బౌలింగ్ చేస్తున్నామని అనుకున్నప్పుడు బౌలర్లు లెప్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తున్నా ఓవర్ ద వికెట్ కే కట్టుబడి ఉంటారు, కానీ మధ్వాల్ మాత్రం అ రౌండ్ ద వికెట్ బౌలింగ్ వేసి తొలిబంతికే పూరన్ ను పెవిలియానికి పంపాడు.
ఒకవేళ ధోని కెప్టెన్ గా ఉండి.. పూరన్ ఔట్ అయి ఉంటే ధోని వేసిన ఎత్తుగడలాగా చెప్పేవారని గవాస్కర్ వెల్లడించారు. మధ్వాల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వెనుక రోహిత్ కు క్రెడిట్ ఇవ్వాలని సన్నీ సూచించాడు.