LOADING...
Virat Kohli : ప్రమాదంలో కోహ్లీ వరల్డ్ రికార్డు.. కన్నేసిన పాక్ క్రికెటర్!
ప్రమాదంలో కోహ్లీ వరల్డ్ రికార్డు.. కన్నేసిన పాక్ క్రికెటర్!

Virat Kohli : ప్రమాదంలో కోహ్లీ వరల్డ్ రికార్డు.. కన్నేసిన పాక్ క్రికెటర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ డకౌట్ కావడంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అదే ఫర్హాన్ గ్రూప్ దశలో నమీబియాతో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి విమర్శకులకు బదులిచ్చాడు. 'డూ ఆర్ డై'గా మారిన ఈ పోరులో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగి నమీబియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పాడు. ఫర్హాన్ విధ్వంసకర శతకంతో పాకిస్థాన్ ఆ మ్యాచ్‌లో గెలిచి సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిపోయి ఉంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది.

Details

నాలుగు మ్యాచుల్లో 220 పరుగులు

సూపర్-8కు ముందు ఫర్హాన్ ఫామ్ అందుకోవడం పాకిస్థాన్‌కు ఎంతో కీలకంగా మారింది. నమీబియాపై సెంచరీతో టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఫర్హాన్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు నాలుగు మ్యాచ్‌ల్లో మొత్తం 220 పరుగులు చేశాడు. ఇప్పుడు అతడి దృష్టి విరాట్ కోహ్లీ సృష్టించిన ప్రపంచ రికార్డుపై ఉంది. ఆ రికార్డును అందుకోవాలంటే ఫర్హాన్‌కు ఇంకా కేవలం 100 పరుగులు మాత్రమే అవసరం. టీ20 ప్రపంచకప్ 2014 ఎడిషన్‌లో కోహ్లీ 319 పరుగులు సాధించాడు.

Details

కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం

ఫర్హాన్ కోహ్లీ రికార్డును అధిగమిస్తే, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. సూపర్-8లో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. జట్టు ఫైనల్‌కు చేరుకుంటే మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం ఐదు మ్యాచ్‌లు అతడి ముందున్నాయి. ప్రస్తుత ఫామ్ కొనసాగితే కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం ఫర్హాన్‌కు స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement