కైల్ మేయర్స్ సునామీ ఇన్నింగ్స్.. లక్నో భారీ స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 16వ సీజన్ శనివారం డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లగా కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ బరిలోకి దిగారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులకే చేతన్ సకరియా బౌలింగ్ లో వెనుతిరిగాడు.
అయితే మరో ఓపెనర్ కైల్ మేయర్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో ( ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లు) 73 పరుగులు చేశాడు. అనంతరం భారీ ఆడబోయు కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో కైలే మేయర్స్ బౌల్డ్ అయ్యాడు.
లక్నో
రెండు వికెట్లు తీసిన ఖలీల్ ఆహ్మద్
దీపక్ హుడా(17), స్టోయినిస్ (12) అనుకున్న స్థాయిలో రాణించలేదు. చివర్లో క్రీజులోకి దిగిన నికోలస్ పూరన్ 21 బంతుల్లో (మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు) 36 పరుగులు చేశాడు.
లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
ఖలీద్ ఆహ్మద్, చేతన్ సకారియా రెండు వికెట్లు, , అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ తలో ఓ వికెట్ తీశారు.