IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాహుల్ ఫార్మ్ లో లేడు . ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో మునపటి తన ఫామ్ కొనసాగించి సత్తా చాటుతాడేమో వేచి చూడాల్సిందే. లక్నో గత సీజన్‌లో అరంగేట్రం చేసి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. డీసీ గత సీజన్‌లో ఐదో స్థానంలో నిలిచి ఫ్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌లోనూ లక్నో విజయం సాధించింది.
అరుదైన రికార్డుకు చేరువలో డేవిడ్ వార్నర్
లక్నో తరుపున రాహుల్ గత సీజన్లో 616 పరుగులతో అత్యధిక పరుగుల చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీపక్ హుడా గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 32.21 సగటుతో 451 పరుగులు చేశాడు. అవేష్ ఖాన్ 18 వికెట్లు తీసి, లక్నో తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. డేవిడ్ వార్నర్ మరో అరుదైన ఫీట్ కు చేరువలో ఉన్నారు. ఐపీఎల్‌లో 6వేల పరుగులు పూర్తి చేయడానికి 119 పరుగుల దూరంలో ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లతో విజృంభించాడు. కుల్దీప్ యాదవ్ గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 21 వికెట్లు తీసి, ఢిల్లీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.