IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ
గత సీజన్‌లో తొలిసారిగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టు టాప్ 4లో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి టైటిల్‌ను పట్టేయాలని లక్నో చూస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు బలబలాలను తెలుసుకుందాం కేఎల్ రాహుల్, క్వింటాన్ డికాక్ వంటి ప్రపంచ స్థాయి ఓపెనర్లతో లక్నో బలంగా ఉంది. ఈ ఇద్దరు క్రీజులో నిలబడితే స్కోరు పరిగెత్తాల్సిందే. ముఖ్యంగా నికోలస్ పూరన్‌ను వేలంలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ స్టార్ ప్లేయర్‌పై ఆ జట్టు భారీ అంచనాలనే పెట్టుకుంది. ఇక దీపక్‌హుడా, రోమారియో షెవర్డ్ వంటి హార్డ్ హిట్టర్లు ఆ జట్టుకు అదనపు బలం.
ఆల్ రౌండర్లతో పటిష్టంగా లక్నో సూపర్ జెయింట్స్
ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్‌తో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, కరణ్ శర్మ వంటి ప్లేయర్లతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, అవేశ్ ఖాన్, ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్, అమిత్‌మిశ్రా, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, కృనాల్‌పాండ్యా, రవిబిష్ణోయ్, డేనియల్ సామ్స్, కరణ్ శర్మ, రొమారియో షెపర్డ్, మార్కస్ స్టొయినిస్, స్వప్నిల్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, మనన్ వోహ్రా, మార్క్‌వుడ్, మయాంక్‌యాదవ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్.