IPL 2023 : లఖ్నవూ సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీ
RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది . 2022లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ఆకుపచ్చ-నీలం రంగు జెర్సీని ఉపయోగించింది. ఈ సారి తమ లుక్ ను పూర్తిగా మార్చేసింది. కొత్త జెర్సీని లఖ్నవూ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా లఖ్నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మెంటార్ గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు
IPL 2023 : లఖ్నవూ సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీ
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఈ సీజన్ టీం సభ్యులు వీరే
జెర్సీ ముందు భాగంలో ఎరుపు చారలు ఉన్నాయి. 2023 ఐపీఎల్ లో కొత్త జెర్సీ తమకు అవసరమైన అదృష్టాన్ని తెస్తుందని జట్టు భావిస్తోంది. కాగా, గతేడాది లీగ్ లో లక్నో గొప్పగా రాణించింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌కు ఎల్‌ఎస్‌జి జట్టు: కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, నికోలస్ పూరన్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, ప్రేరక్ మన్కడ్, స్వప్నిల్ సింగ్, నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ చరక్.