IND vs AUS: ఆహ్మదాబాద్ టెస్టులో రాహుల్-గిల్‌ని ఆడించాలి : రికి పాటింగ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ టీమిండియా వెళ్లాలంటే నాలుగో టెస్టును తప్పక గెలవాలి. అయితే తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జనలను పడుతోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 9న నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టులో విఫలమైన రాహుల్‌ను తప్పించి, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కి అవకాశం కల్పించింది. మూడో టెస్టులో గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టులో వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలో టీమిండియాకు అంతు చిక్కడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ స్పందించాడు. ఆహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగో టెస్టులో రాహుల్, గిల్ ఇద్దరూ ఉండాలని పాంటింగ్ తెలిపారు.
రాహుల్‌ని మిడిలార్డర్‌లో ఆడించాలి
గిల్‌ను ఓపెనింగ్ స్థానంలో ఆడించి, రాహుల్ మిడిలార్డర్‌లో ఆడించాలని, ఇంగ్లండ్ సిరీస్‌లో రాహుల్‌కు మిడిలార్డర్ లో ఆడిన అనుభవం ఉందని, యూకే పరిస్థితుల మాదిరిగా చివరి టెస్టులో భారత్-ఆస్ట్రేలియా ఇరు జట్లు తమ బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలని రికి పాంటింగ్ చెప్పారు. యూకేలో బంతి పగటి పూట స్వింగ్ అవుతుందని, కావున పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ కూడా బంతి స్వింగ్ అయ్యే అవకాశముందని పాంటింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందుంది. నాలుగో టెస్టులో గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించాలని టీమిండియా భావిస్తోంది.