Page Loader
ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం
గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్న బుమ్రా

ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌కు బుమ్రా దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కి భారీ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ కు దూరమయయాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా ఎనిమిది నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది ICC T20 ప్రపంచ కప్ లో గాయపడిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు బుమ్రా దురమైన విషయం తెలిసిందే. గాయం తీవ్రత తగ్గడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌తో జూన్ లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుండి కూడా బుమ్రా వైదొలిగాడు.

బుమ్రా

బుమ్రాకు శస్త్ర చికిత్స అవసరం

బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య సిబ్బంది తెలిపింది. ప్రస్తుతం అతనికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడితే బుమ్రా కెరీర్ రిస్క్‌లో పడే ప్రమాదం ఉందని, అందుకే సీజన్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు బుమ్రా. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సీజ‌న్ కూడా మిస్ కాలేదు. తొలిసారి అత‌డు ఐపీఎల్‌కు దూరం కాబోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి మొద‌లుకానుంది.