
బుమ్రా ఐపీఎల్ ఆడకపోతే ప్రపంచం ఆగిపోతుందా : మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమిండియాకు జస్ప్రిత్ బుమ్రా దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్‌కు కూడా అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
దీంతో బుమ్రా మళ్లీ ఐపీఎల్‌లో ఆడతాడనని వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటికి ఫూర్తి ఫిట్ నెస్ సాధించకపోతే ఎలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు బుమ్రాని అందుబాటులో ఉంచేందుకు బీసీసీఐ అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం.
దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొన్ని మ్యాచుల పాటు బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలన్నారు.
బుమ్రా
ఫిట్‌నెస్ సాధిస్తేనే మ్యాచ్ ఆడాలి
బుమ్రా ముందు టీమిండియా ఆటగాడిని ఆ తర్వాతే ఫ్రాంచైజీ క్రికెటర్‌ని, ఈ విషయంలో బీసీసీఐ కీలక బాధ్యత తీసుకోవాలని చోప్రా తెలిపాడు.
ముంబై తరఫున ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఈ సీజన్‌లో పునరాగమనం చేస్తున్నాడని, అతనితో కలిసి బుమ్రా ఒక ఏడెనిమిది మ్యాచులు ఆడకపోతే కొంపలేమన్నా మునిగిపోతాయా లేదా ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా అని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు.
ఫిట్‌గా ఉంటే మాత్రం ఏ ఆటగాడైనా ఆడుతూనే ఉంటాడని, ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆడాలని, అప్పుడే ఆట మెరుగవుతుందని చోప్రా వివరించాడు