Page Loader
IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..!
స్టేడియానికి రాబోతున్న రిషబ్ పంత్

IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2023
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఏడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఓ 5-6 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ నడిపించబోతున్నాడు. ప్రస్తుతం పంత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లను ఆడనుంది. ఆ మ్యాచ్‌ల్ని వీక్షించేందుకు రిషబ్ పంత్ స్టేడియానికి రాబోతున్నాడు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ఏర్పాట్లను చేస్తోంది. డగౌట్‌లో అతని ప్రత్యేక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని డీడీసీఏ తెలిపింది.

రిషబ్ పంత్

పంత్‌ స్థానంలో అభిషేక్‌ పోరెల్‌

ఐపీఎల్ 16వ సీజన్ లో పంత్ ఆడకపోయినా డగౌట్ లో ఉంటే బాగుంటుందని డీడీసీఏ డైరక్టర్ చైర్మన్ శ్యామ్ శర్మ పేర్కొన్నారు. పంత్ గ్రౌండ్ లో ఉంటే కంపర్ట్ గా ఫీలవుతాడంటే అతని కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తామని, అతని ప్రత్యేక మెడికల్ టీం ని ఇంటికి పంపించి, స్టేడియానికి తీసుకురావడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు. పంత్‌ జెర్సీ నెంబర్‌తో కూడిన టీషర్ట్‌లను ప్రత్యేకంగా తయారు చేయించి, జట్టు మొత్తం ధరించేలా చూస్తామని, అవసరమైతే పంత్‌ను డగౌట్‌లో కూర్చొబెట్టి మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కల్పిస్తామని గతంలో రికిపాటింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక పంత్‌ స్థానంలో అభిషేక్‌ పోరెల్‌ను ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ తెలిపింది