
యాక్సిడెంట్ తర్వాత తొలి అడుగు వేసిన రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.
రాబోయే 18 నెలల్లో ముఖ్యమైన క్రికెట్ ఈవెంట్లు జరగనున్నాయి. దీంతో పంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు అశిస్తున్నారు.
పంత్ ఇప్పటికే జరుగుతున్న ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుండి తప్పుకున్నాడు.
18 నెలలు మైదానంలోకి అడుగు పెట్టే అవకాశం పంత్‌కు లేనందున వన్డే ప్రపంచకప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు దూరమయ్యే అవకాశం ఉంది.
రిషబ్‌పంత్
త్వరగా కోలుకుంటున్న రిషబ్‌పంత్
పంత్ గతేడాది తన తల్లిని చూసేందుకు కారులో వెళుతుండగా.. కారు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. స్థానికులు అతి కష్టం పంత్‌ను బయటికి తీశారు. అప్పటికే పంత్‌కు కాలు, వీపుకి తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో పంత్‌కు ప్రాణాపాయం తప్పింది.
తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఫోటోలో ఒక అడుగు... ముందుకు! ఒక అడుగు... బలంగా! ఒక అడుగు... మెరుగ్గా! అంటూ తన ఫొటోలకు క్యాప్షన్ పెట్టాడు
పంత్ టెస్టులో 33 మ్యాచ్ ల్లో 2,271 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, అరు అర్ధ సెంచరీలున్నాయి. అయితే పంత్ 90వద్ద అరుసార్లు టెస్టుల్లో ఔటయ్యాడు,