Page Loader
ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ
ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం

ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2023
01:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గైర్హాజరతో జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. ఐపీఎల్లో రిషబ్ పంత్ ఆడే అవకాశం లేదు. అయినా ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధించడానికి కృషి చేస్తామని గంగూలీ విలేకర్లతో చెప్పారు. పంత్ ప్రస్తుతం కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల స్వదేశీ టెస్ట్ సిరీస్‌కు కూడా పంత్ దూరం కానున్నాడు.

రిషబ్ పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్..?

పంత్ స్థానంలో డిసి కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ కు అప్పగించే అవకాశం ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కి తొలి టైటిల్ ను అందించాడు. వార్నర్ కెప్టెన్ గా 69 ఐపీఎల్ మ్యాచ్ లో 35 విజయాలను అందించాడు. 162 మ్యాచ్ లలో 42.01 సగటుతో 5,881 పరుగులు చేశాడు. 2016లో అరంగేట్రం చేసిన పంత్ ఐపీఎల్ లో కీలకపాత్ర పోషించాడు. మొత్తం 98 మ్యాచ్ లు ఆడిన పంత్ 34.61 సగటుతో 2,838 పరుగులు చేశాడు. 2021లో మొదటి ఢిల్లీ ఫ్లే ఆప్ కు వెళ్లడానికి రిషబ్ పంత్ ఎనలేని కృషి చేశాడు.