Page Loader
బీసీసీఐ సెక్రటరీకి మెస్సీ సంతకం చేసిన జెర్సీ
మెస్సీ జేర్సీతో బీసీసీఐ కార్యదర్శి

బీసీసీఐ సెక్రటరీకి మెస్సీ సంతకం చేసిన జెర్సీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2022
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ నుండి సంతకం చేసిన జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెక్రటరీ జే షా అందుకున్నారు. ఖతార్‌లో జరిగిన FIFA ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను మెస్సీ సేన ఓడించింది. భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో మెస్సీ సంతకం చేసిన జర్సీని పోస్టు చేశాడు. అదే విధంగా త్వరలో ఒకదాన్ని పొందుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ప్రపంచ్ కప్ గెలిచిన అర్జెంటీనా జట్టుకు జేషా శుభాకాంక్షలు తెలిపాడు. మూడోసారి ప్రపంచకప్ గెలిచిందని, అర్హులకే జట్టుకే కప్ వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

బీసీీసీఐ

మెస్సీ కల సాకారమైంది

పెనాల్టీలో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మెస్సీ ఆటలో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 35 ఏళ్ల మెస్సీ తన కెరీర్‌లో ఇంతవరకు తప్పించుకున్న FIFA ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకోవాలనే కోరిక సాకరమైంది. ఏడు గోల్‌లతో పాటు మూడు అసిస్ట్‌లను అందించాడు, అత్యుత్తమ ప్రదర్శనతో మెస్సీ గోల్డెన్ బాల్‌ను సొంతం చేసుకున్నాడు.అర్జెంటీనా గెలుపు చారిత్రాత్మకమని పలువురు ట్విట్స్ చేసిన విషయం తెలిసిందే.