LSG vs MI: ఫైనల్ లక్ష్యంగా రోహిత్ సేన.. తగ్గేదేలా అంటున్న లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ M.A. చిదంబరం స్టేడియంలో బుధవారం రాత్రి 7: 30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎన్నో ఒడిదొడుకులకు అధిగమించి ఫ్లే ఆఫ్స్ కు చేరింది. ప్రస్తుతం మంచి ఊపు మీదున్న ముంబైని అడ్డుకోవడం ప్రత్యర్థులకు అంత ఈజీ కాదు. లక్నో, ముంబై బ్యాటింగ్ లో బలాలపరంగా సమానంగా ఉన్నా.. బౌలింగ్ లో మాత్రం లక్నోదే పైచేయి. లీగ్ లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ జట్టుతో మూడుసార్లు తలపడ్డ లక్నో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి మంచి జోరుమీద ఉంది.
ఇరు జట్ల లోని సభ్యులు
లక్నో బ్యాటర్లలో స్టోయినిస్, మేయర్స్, పూరన్ రాణిస్తుండడం ఆ జట్టుకు కలిసొచ్చే ఆంశం. ముంబై తరుపున రోహిత్, కిషాన్, సూర్యకుమార్ యాదవ్, కామరూన్ గ్రీన్ బ్యాటింగ్ విభాగంలో దుమ్ములేపుతున్నారు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, డికాక్(వికెట్ కీపర్), పెరాక్ మన్‌కడ్, స్టోయినిస్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), పూరన్, ఆయుద్ బదోనీ, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్ ఠాకూర్ ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/విష్ణు వినోద్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్దాన్, పీయుష్ చావ్లా, ఆకాస్ మధ్వాల్, హృతిక్ షోకీన్