NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్
    రాణించిన చైన్నై బౌలర్లు

    IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 23, 2023
    11:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఫైనల్స్ లోకి చైన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1 మ్యాచులో చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో చైన్నై అద్భుత విజయం సాధించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చైన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో (7 ఫోర్లు, ఓ సిక్సర్) 60 పరుగులు, డెవెన్ కాన్వే 34 బంతుల్లో (4ఫోర్లు) 30 పరుగులతో చెలరేగారు.

    చివర్లో రవీంద్ర జడేజా 16 బంతుల్లో 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ తలా రెండు వికెట్లు తీశారు.

    Details

    చెలరేగిన చైన్నై బౌలర్లు

    లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ 41 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. సాహా12, హార్ధిక్ పాండ్యా8 పరుగులతో దారుణంగా విఫలమయ్యారు. శుభ్‌మాన్ గిల్ 42 పరుగులతో అకట్టుకున్నాడు.

    చివర్లో రషీద్ ఖాన్ 16 బంతుల్లో (2 సిక్సర్లు, 3 ఫోర్లు) 30 పరుగులతో విజృంభించినా ఫలితం లేకుండా పోయింది.

    మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో గుజరాత్ ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌటైంది.

    చాహర్, తీక్షణ, జడేజా, పతిరణ తలా రెండు వికెట్లు తీసి చైన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. నేటి మ్యాచ్ లో ఓడిన గుజరాత్ జట్టు మే 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    ఐపీఎల్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    చైన్నై సూపర్ కింగ్స్

    మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు ఐపీఎల్
    అరంగ్రేటం మ్యాచ్‌లోనే శభాష్ అనిపించుకున్న రాజవర్దన్ క్రికెట్
    ధోనిపై విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టిన కోచ్ స్టీఫెన్ క్రికెట్
    నేడు కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్.. గెలిచేదెవరో! ఐపీఎల్

    ఐపీఎల్

    SRH vs GT: శుభ్ మన్ గిల్ సెంచరీ; 188పరుగులు చేసిన గుజరాత్  క్రీడలు
    SRH vs GT: విజృంభించిన గుజరాత్ బౌలర్లు; సన్ రైజర్స్ ఘోర పరాజయం   క్రీడలు
    బౌలింగ్ పై నమ్మకం పెంచుకున్న కోహ్లీ: 40పరుగులకే ఆలౌట్ చేసేవాడినంటూ కామెంట్స్  విరాట్ కోహ్లీ
    ఆర్సీబీ ప్లేయర్లను ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చిన సిరాజ్: ఫోటోలు వైరల్  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025