
చైన్నై, గుజరాత్ మధ్య నేడు బిగ్ ఫైట్..ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో రెండు ధీటైన జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచులో నాలుగుసార్లు చాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
చైన్నై వేదికగా మ్యాచ్ జరగడం ధోని సేనకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచులు జరగ్గా మూడింట్లోనూ గుజరాత్ టైటాన్సే నెగ్గింది.
ఈ నేపథ్యంలో రెండు సమఉజ్జీల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ లోకి ప్రవేశించనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ జట్టు సమిష్టిగా ఉంది. ఎనిమిదో స్థానం వరకు హిట్టింగ్ చేసే స్టార్లు ఆ జట్టు సొంతం.
Details
ఇరు జట్ల బలాలు, బలహీనతలు
గిల్, విజయశంకర్, హార్ధిక్ పాండ్యా, మిల్లర్, తెవాటియాతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ లో రషీద్ ఖాన్ దుమ్మురేపుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. చైన్నై బ్యాటింగ్ ఆర్డర్ సూపర్ ఫామ్ లో ఉండగా బౌలింగ్లో కాస్త బలహీనంగా ఉంది. గైక్వాడ్, కాన్వే, రాయుడు, శివం దూబే, ధోని శక్తిమేర రాణిస్తే చైన్నై ఫైనల్ కు చేరే అవకాశం ఉంది.
గుజరాత్: గిల్, సాహా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, మిల్లర్, షనక, తెవాటియా, రషీద్ ఖాన్, యశ్ దయాల్, షమీ, నూర్అహ్మద్, మోహిత్ శర్మ
చెన్నై: కాన్వే, గైక్వాడ్, రహానే, శివమ్ దూబే, మొయిన్అలీ, రాయుడు, జడేజా, ధోనీ(కెప్టెన్), చాహర్, తీక్షణ, దేశ్‌పాండే, పతీరణ.