IPL 2023: ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లు.. ఏయే టీమ్స్ తలపడుతున్నాయంటే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 చివరి దశకు చేరుకుంది. ఫ్లే ఆఫ్స్ చేరుకునే టీమ్‌లు ఏవనే సస్పెన్స్ కు తెరపడింది. ఫ్లే ఆఫ్స్ లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ అడుగుపెట్టాయి. నాలుగు స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ , ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీపై గుజరాత్ విజయం సాధించడంతో ముంబై ఫ్లేఆఫ్స్ కి అర్హత సాధించింది. అయితే ఐపీఎల్ ఫ్లే ఆఫ్స్ మ్యాచుల షెడ్యుల్ ఖరారు అయిపోయింది. క్వాలిఫయర్ ఫస్ట్ మ్యాచులో మే23న చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడున్నాయి.
ఫ్లే ఆఫ్స్ షెడ్యూల్ ఖరారు
ఇక ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మే 24న చైన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అదే విధంగా క్వాలిఫయర్ 2 మ్యాచులో క్వాలిఫయర్ 1లో ఓటమిపాలైన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచులో విజేతగా నిలిచిన జట్టు పోటీ పడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే28న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఫైనల్ చేరే జట్ల వివరాలపై మరో మూడు రోజుల్లో స్పష్టత రానుంది.