హిట్ మ్యాన్ ఖాతాలో మరో స్పెషల్ రికార్డు.. కోహ్లీ సరసన నిలిచిన రోహిత్
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో స్పేషల్ రికార్డును సాధించాడు. ఆదివారం సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో హిట్ మ్యాన్ (56) అర్ధ శతకంతో రాణించాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. కీలక మ్యాచులో బ్యాట్ కు పని చెప్పాడు.
సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో అద్భుత ఫామ్ ను అందుకొని మరో అరుదైన రికార్డును తమ పేరిట రాసుకున్నాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో 11వేల పరుగులు పూర్తిచేసిన రెండో భారత్ క్రికెటర్ గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచులో 37 బంతుల్లో 56 పరుగులు చేసి ఆ ఫీట్ ను అందుకున్నాడు.
Details
ముంబై ఇండియన్స్ తరుపున 5వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్
రోహిత్ శర్మ కంటే ముందు కింగ్ కోహ్లీ 11వేల పరుగులను పూర్తి చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 11,864 పరుగులతో టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 11,021 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 11వేల మైలురాయిని అందుకున్న 7వ బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డును సృష్టించాడు. అతడి కంటే ముందుగా క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పోలార్డ్, డేవిడ్ వార్నర్ ఉన్నారు.
రోహిత్ శర్మ 241 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 6,191 పరుగులు చేశాడు. ఇందులో 5 వేల పరుగులు ముంబయి తరుపున చేయగా.. మిగిలినవి డెక్కన్ ఛార్జర్స్‌తో ఆడినప్పుడు చేశాడు.