విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
జెర్సీనెంబర్ 18 చెప్పగానే.. క్రికెట్ ప్రపంచంలో వెంటనే గుర్తుకొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో దిగిన ప్రతిసారీ కింగ్ కోహ్లీ 18వ నెంబర్ ఉన్న జెర్సీనే ధరిస్తాడు.
హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో సెంచరీ బాదిన కోహ్లీ.. 18వ నెంబర్ తో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు.
అండర్-19 క్రికెట్ ఆడేటప్పుడు తన పేరుపై ఆ నంబర్ తో జెర్సీ ఇచ్చారని, అయితే ఆ తర్వాత ఈ నంబర్ తన జీవితంలో ప్రత్యేకంగా మారిందని కోహ్లీ పేర్కొన్నారు.
తాను క్రికెట్లో అరంగేట్రం చేసింది ఆగస్టు 18, తన తండ్రి చనిపోయింది డిసెంబర్ 18 అని, తన జీవితంలో ఈ రెండు ముఖ్యమైన క్షణాలని కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.
Details
ఐపీఎల్ లో దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లీ
కోహ్లీ ఐపీఎల్ లో ఆరో సెంచరీ చేసింది మే 18న, ఇక ఐపీఎల్ రెండో సెంచరీని మే 18నే బాదాడు. కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఆగస్టు 18న అడుగుపెట్టాడు.
ఐపీఎల్ లో కోహ్లీ 7,062 పరుగులను పూర్తి చేశాడు. ఇండియా తరుపున అన్ని ఫార్మాట్లోనూ 25పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.86 స్ట్రైక్ రేట్‌తో 538 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి.
ఇక సచిన్ 10వ నెంబర్ జెర్సీ, ధోని 07వ నెంబర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 45వ నెంబర్ జెర్సీని ధరించి దుమ్ములేపుతున్నారు.