FIFA World Cup: వరల్డ్ కప్‌లో భారీ సంచలనం.. ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన స్పెయిన్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా వరల్డ్ కప్ 2026లో అభిమానులు ఊహించినట్లుగానే మరో సంచలన ఫలితం నమోదైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టుకు స్పెయిన్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత ప్రదర్శనతో 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ పరాజయంతో ఫ్రాన్స్ వరల్డ్ కప్ గెలవాలన్న ఆశలు సెమీఫైనల్ దశలోనే ముగిశాయి. మరోవైపు స్పెయిన్ 16 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించి అరుదైన ఘనత సాధించింది.
వివరాలు
నిరాశపరిచన ఎంబాప్పే
మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. బంతిపై నియంత్రణతో పాటు దూకుడైన దాడులతో ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు.
ఫలితంగా రెండు కీలక గోల్స్ సాధించి విజయం ఖాయం చేసుకున్నారు. ఫ్రాన్స్ కెప్టెన్, స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాప్పేపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో అతడు ప్రభావం చూపలేకపోయాడు.
మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆటగాళ్లదే పైచేయిగా కనిపించగా, ఫ్రాన్స్ ఆశించిన స్థాయిలో పోరాడలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.