మాంచెస్టర్ సిటీతో జియో కీలక ఒప్పందం
మాంచెస్టర్ సిటీ జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్ (JIO)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ సేవల బ్రాండ్ క్లబ్ అధికారిక మొబైల్ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ భాగస్వామిగా జియో అవతరించనుంది. ఇండియాలో అతిపెద్ద సంస్థ అయినా జీయో RISE వరల్డ్ ద్వారా ఈ భాగస్వామ్యాన్ని ప్రారంభించనుంది. దీంతో మాంచెస్టర్ సిటీ జియోలో వివిధ రకాల ఆకర్షణీయమైన అనుభవాలను అందించడానికి సహకరించనుంది. వాటిని Jio డిజిటల్ ఎకోసిస్టమ్ ద్వారా JioTV, MyJio, Jio STB, JioEngage ఇతర అప్లికేషన్‌లకు యాక్సెస్‌గా ఉపయోగించవచ్చు. దీంతో మార్కెట్ కార్యకలాపాలు కూడా సజావుగా జరగనున్నాయి.
భాగస్వామిగా ఉన్నందుకు హర్షం వ్యక్తం చేసిన ఆకాష్ అంబాని
కొత్త ఒప్పందంలో భాగంగా, మ్యాన్ సిటీ OTT ప్లాట్‌ఫారమ్ CITY+లో మ్యాచ్ హైలైట్‌లు, లైవ్ మాంచెస్టర్ సిటీ ఉమెన్స్ టీమ్, ఎలైట్ డెవలప్‌మెంట్ స్క్వాడ్ ఫిక్చర్‌లు, మ్యాచ్‌డే కంటెంట్, సిటీ స్టూడియోస్ డాక్యుమెంటరీలతో సహా Jio TV ప్లాట్‌ఫారమ్‌లో విలీనం చేయనున్నారు. మాంచెస్టర్ సిటీకి అధికారిక భాగస్వామిగా జియో ఉన్నందుకు సంతోషంగా ఉందని ఛైర్మన్ ఆకాష్ అంబాని పేర్కొన్నారు. రెండు బ్రాండ్‌లు తమ కమ్యూనిటీలకు పరివర్తన ప్రభావాన్ని తీసుకురావడానికి సమానమైన విలువలను పంచుకుంటాయని తెలిపారు. అత్యుత్తమ ఫుట్‌బాల్‌ను అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఫుట్ బాల్ కు ఇండియాలో ఆదరణ పెరుగుతోందని, ప్రస్తుతం మేము కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ప్రత్యేకించి డిజిటల్, సాంకేతిక రంగంలో ఇంకా ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తామన్నారు.