Page Loader
SA vs IND: సంజు శాంసన్ ఆటపై మార్క్రమ్ ప్రశంసలు.. రెండో మ్యాచులో రాణిస్తాం 
సంజు శాంసన్ ఆటపై మార్క్రమ్ ప్రశంసలు.. రెండో మ్యాచులో రాణిస్తాం

SA vs IND: సంజు శాంసన్ ఆటపై మార్క్రమ్ ప్రశంసలు.. రెండో మ్యాచులో రాణిస్తాం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్ సంజు శాంసన్ వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికాపై కేవలం 50 బంతుల్లో 107 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని సౌతాఫ్రికా కెప్టెన్ మర్క్రమ్ పేర్కొన్నారు. అయితే సెంచరీ హీరో సంజు శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడని, తమ ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేదన్నారు. క్రీజ్‌లో సంజు శాంసన్ పాతుకుపోయి, దూకుడుగా ఆడుతున్నప్పుడు అతన్ని ఆపడం చాలా కష్టంగా మారింది. సంజూ ఇన్నింగ్స్ నిజంగా అభినందనీయమైందన్నారు.

Details

రేపే రెండో టీ20 మ్యాచ్

అయితే డెత్ ఓవర్లలో పుంజుకోవడం ఆనందంగా ఉందని, క్రిస్ కొయిట్జీ, యాన్‌సెన్ మంచిగా బౌలింగ్ చేయడంతో భారత్‌ ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నామని వెల్లడించారు. లక్ష్య ఛేదనలో సరైన ఆరంభం దక్కలేదని, అదే మ్యాచ్‌లో వెనకబడటానికి కారణమన్నారు. రెండో మ్యాచ్‌లో పుంజుకొని, కచ్చితంగా విజయం సాధిస్తామని మర్క్రమ్ అశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం టీమిండియా, భారత్ మధ్య రెండో టీ20 జరగనుంది.