Page Loader
బాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!
2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదోలిగిన మేరీకోమ్

బాక్సింగ్ నుంచి మేరీ కోమ్ అవుట్..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీకోమ్ 2023 బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నుండి వైదొలిగింది. ఈ ఏడాది బాక్సింగ్ మహిళల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం లేదని మేరీ కోమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. IBA ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ఈ ఏడాది మే 1 నుండి 14 వరకు ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరగనున్నాయి. తాను గాయం కారణంగా IBA మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2023లో పాల్గొనడం లేదని, ఇందులో పాల్గొనవారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మేరీ చెప్పారు.

మేరీకోమ్

మేరీకోమ్ విజయవంతమైన బాక్సర్

మోకాలి గాయం కారణంగా గతేడాది మేరీకోమ్ బర్నింగ్ హోమ్ కామన్వెల్త్ గేమ్స్ కు దూరమైంది. 48 కేజీల సెమీఫైనల్స్ ప్రారంభ రౌండ్‌లో ఆమె మొదటి కొన్ని నిమిషాల్లో తన ఎడమ మోకాలికి స్వల్ప గాయమైంది. మొదటి రౌండ్‌లో ఒక పంచ్‌ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మేరీ కాన్వాస్‌పై పడిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల చరిత్రలో మేరీ అత్యంత విజయవంతమైన బాక్సర్ అని చెప్పొచ్చు మొదటి ఏడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకం సాధించిన ఏకైక మహిళా బాక్సర్‌గా ఆమె నిలిచింది. 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా రికార్డుకెక్కింది. ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకొని సత్తా చాటింది.