LOADING...
Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!
మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!

Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
10:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివాదాల కేంద్రంగా మారింది. రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ వేదికల నుండి వైదొలగడం వంటి పరిణామాల తర్వాత, ఇప్పుడు దేశ క్రికెట్ చరిత్రను కలకలం పెట్టే మ్యాచ్ ఫిక్సింగ్ సమస్య బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన CJKS టాలెంట్ కప్ 2026లో ఏడుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌లో పాల్గొన్నారు అని తేలడంతో, వారిపై తీవ్ర చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 3న జరిగిన టీ20 టోర్నమెంట్‌లో బాకలియా ఏకాదశ, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి.

వివరాలు

కావాలనే త్వరగా అవుటయ్యారిలా..

బాకలియా జట్టులో ఉన్న ఏడుగురు ఆటగాళ్లు—సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఉమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహ్మద్ ఇక్బాల్, నాజ్ముల్ ఇస్లాం—వింతగా ఆడుతూ త్వరగా అవుట్ అయ్యారు. ఈ ప్రవర్తనపై అనుమానం పుట్టిన అధికారులు విచారణ జరపగా, వారు ఉద్దేశపూర్వకంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఫిక్సింగ్‌లో కేవలం ఆటగాళ్లే కాకుండా కోచ్ అమీనుల్ హక్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీన్ని తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తూ, CJKS కోచ్‌ను ఐదేళ్ల పాటు అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది. అదనంగా, ఏడుగురు ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని దేశీయ లీగ్‌లలో అమలు చేయాలని BCBకి అధికారికంగా సూచించింది.

వివరాలు

గట్టి ప్లాన్ వేసిన బంగ్లాదేశ్

గతంలో కూడా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. BCB డైరెక్టర్ ముఖ్లేసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. 2025 సీజన్‌లో ఆరుగురు జాతీయ ఆటగాళ్లు సహా మొత్తం 10 మంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం గమనంలో ఉన్నారు. ఇలాంటి వరుస సంఘటనలు ప్రపంచ క్రికెట్ వేదికపై బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ గెలవడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 12 నెలల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి జట్లతో సిరీస్‌లు జరుగనున్నాయి. భారత్‌తో సంబంధాలను పునరుద్దరించేందుకు, మహిళా బీపీఎల్ (WBPL) ద్వారా భారత మహిళా క్రికెటర్లను ఆహ్వానించాలని బంగ్లాదేశ్ బోర్డు భావిస్తోంది.

Advertisement