
2022 క్రికెట్ చరిత్రలో ఈ అద్భుత ఇన్నింగ్స్‌లకు ఫ్యాన్స్ ఫిదా
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్లో చర్రితలో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు కొన్ని ఉంటాయి. 2022 ఎంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోనున్నాయి.
బే ఓవల్ టెస్టులో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించి ఆతిథ్య న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు వికెట్లు తీసుకున్న బంగ్లా బౌలర్ ఎబాదత్ హోస్సేన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
టీ20 ప్రపంచ కప్ సూపర్-12లో మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, భారత్ మ్యాచ్ ను చూస్తే ఇప్పటికి సస్పెన్స్ థ్రిల్లర్ ను తలిపిస్తుంది. అఖరి వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో కోహ్లీ 82 పరుగులు సాధించి, భారత్‌కు గుర్తిండిపోయే విజయాన్ని అందించాడు.
సూర్యకుమార్ యాదవ్
భారత్ వెన్నముకలా నిలిచిన సూర్యకుమార్ యాదవ్
మిర్పూర్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా 2-0తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. రెండో టెస్టులో అయ్యర్, అశ్విన్ ఎనిమిదో వికెట్టుకు 71 పరుగులు జోడించి, భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు.
టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 1 పరుగుతో తేడాతో జింబాబ్వే ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
30 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సూర్యకుమార్.. అనతికాలంలోనే టీమిండియాకు వెన్నెముకలా మారిపోయాడు.
ఇంగ్లాడ్ తో జరిగిన చివరి టీ20లో సూర్యకుమార్ 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 117 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్రపోషించాడు.