Page Loader
పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్
77 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్

పాకిస్తాన్‌కు విజయాన్ని అందించిన మహ్మద్ రిజ్వాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ అజేయంగా 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో ఏడు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా తన 50వ వన్డేలో 1,100 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్ ఔట్ అయిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరు కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మహ్మద్ రిజ్వాన్

రిజ్వాన్ 86 బంతుల్లో 77 పరుగులు

37వ ఓవర్‌లో బాబర్‌ ఔట్ కావడంతో రిజ్వాన్ గేర్ మార్చాడు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులను వేగంగా రాబట్టాడు. ఆ తర్వాత హరీస్ సొహైల్‌తో కలిసి 64 పరుగులు జోడించాడు. రిజ్వాన్ 86 బంతుల్లో 77 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. రిజ్వాన్ 50 వన్డేల్లో 31.72 సగటుతో 1,142 పరుగులు పూర్తి చేశాడు ఈ ఏడాది ప్రారంభంలో రిజ్వాన్ అన్ని ఫార్మాట్లలో 5,000 పరుగులు పూర్తి చేసిన 28వ పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆయన ఈ ఘనతను సాధించాడు.