Mohammed Shami: ''జైశ్రీరామ్' అనడంపై మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు..?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రజలు 'జై శ్రీరామ్' అని మతపరమైన నినాదాలు చేయడం పట్ల టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అయోధ్య రాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జనవరి 22, 2024న అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశం మొత్తం రామమందిర వేడుకలను ఓ పండుగలా చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్,వెంకటేష్ ప్రసాద్,అనిల్ కుంబ్లే,మిథాలీ రాజ్,విరాట్ కోహ్లీ వంటి పలువురు క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా న్యూస్ 18తో మహ్మద్ షమీ మాట్లాడుతూ అయోధ్య రాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మతంలోనూ ఇతర మతాన్ని ద్వేషించేవాళ్లు ఉంటారని వారితోనూ తనకేమీ ఇబ్బంది లేదని షమీ అన్నాడు.
భారతీయుడిగా నేను గర్విస్తున్నాను: షమీ
వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ సజ్దా వివాదాన్ని కూడా ప్రస్తావించాడు. 'ప్రతి మతంలోనూ ఇతర మతాన్ని ద్వేషించేవాళ్లు ఉంటారని వారితోనూ తనకేమీ ఇబ్బంది లేదనన్నారు. రామ మందిరాన్ని నిర్మించినప్పుడు జై శ్రీరామ్ అనడానికి తప్పేముంది..? వెయ్యి సార్లు అయినా అనొచ్చు. ఒకవేళ నేను అల్లాహుఅక్బర్ నినాదాలు చేయాలనుకున్నప్పుడు వెయ్యిసార్లు నినదిస్తాను. అందులో తప్పేముంది..? భారతీయుడిగా నేను గర్విస్తున్నాను..' అంటూ షమీ తెలిపాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి షమీ తప్పుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే అవకాశముంది. ఐపీఎల్‌లో షమీ గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.