NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత 
    తదుపరి వార్తా కథనం
    Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత 
    ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత

    Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2023
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు.

    హంగేరీ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

    గ్రూప్‌ 'ఏ' లో పోటిపడిన నీరజ్ చోప్రా 88.77 మీటర్లు విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీంతో ఫైనల్ కటాఫ్ మార్క్ 83 మీటర్లను అధిగమించడంతో ఫైనల్‌కు చేరాడు.

    వరల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఇండియన్ గా నిలవడానికి నీరజ్ మరో అడుగు దూరంలో ఉన్నాడు.

    Details

    గోల్డ్ మెడల్ పై కన్నేసిన నీరజ్ చోప్రా

    నిజానికి 2022లో గోల్డ్ మెడల్ గెలవడానికి దగ్గరగా వచ్చినా, చివరికి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నాడు. గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ అప్పుడు గోల్డ్ గెలిచాడు.

    వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో ఇండియా సిల్వర్ మెడల్ గెలవడం కూడా అదే తొలిసారి కావడం విశేషం. ఈ ఏడాది ఎవరూ 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. ఫైనల్లో నీరజ్ ఆ మార్క్ అందుకుంటే గోల్డ్ మెడల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 82.39 మీటర్ల బెస్ట్ త్రోతో రెండో స్థానంలో నిలవగా, భారత్‌కు చెందిన డీపీ మను 81.31 మీటర్ల బెస్ట్ త్రోతో మూడో స్థానంలో నిలిచాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అథ్లెటిక్స్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అథ్లెటిక్స్

    ఉత్తమ అథ్లెట్‌గా ఏపీ అమ్మాయి  స్పోర్ట్స్
    ఆసియా అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు ప్రపంచం
    హ్యాపీ బర్త్ డే పీటీ ఉష: 'పరుగుల రాణి' ఎన్ని అవార్డులు గెలుచుకుందో తెలుసా! ప్రపంచం
    నిరాశపరిచిన జెస్విన్ ఆల్డ్రిన్.. ఫైనల్లో చుక్కెదురు స్పోర్ట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025