LOADING...
T20 WC: టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన నేపాల్
టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన నేపాల్

T20 WC: టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన నేపాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సూపర్‌ 8కు దూసుకెళ్లింది. గ్రూప్‌-సిలో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 9 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యం విండీస్‌కు పెద్ద సవాలుగా మారలేదు. చేదనలో వెస్టిండీస్‌ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయం అందుకుంది. కెప్టెన్‌ హోప్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Details

వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి

అతనికి తోడుగా హిట్ మెయిర్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఓపెనర్‌ బ్రాడ్ కింగ్ 22 పరుగులతో ఫర్వాదలేదనిపించాడు. ఇక వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన నేపాల్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement