
సన్ రైజర్స్‌కి కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 ప్రారంభం కావడానికి సమయం అసన్నమైంది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచేజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ అభిమానులకు అదిరిపోయే వార్త అందించింది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
కాగా ఎస్ఆర్‌హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కషాయానికి కాస్త నల్లరంగును చేర్చింది. ఫ్యాంట్ ఆరెంజ్ కలర్ కాకుండా పూర్తిగా బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. ఈఏడాది సీజన్లో ఎస్ఆర్‌హెచ్ తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్ ను ఎంపిక చేసింంది.
సన్ రైజర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే
ఈ కొత్త జెర్సీల్లో సన్ రైజర్స్ ప్లేయర్స్ మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ మెరిసిపోయారు. ఏప్రిల్ 2న సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.
కొత్త కెప్టెన్, కొత్త జెర్సీతో 2023 ఐపీఎల్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది.
హైదరాబాద్ టీమ్: హ్యారీబ్రూక్, మయాంక్అగర్వాల్, హెన్రిచ్ క్లాసేన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మయాంక్ దాగార్, నితీష్ కుమార్‌రెడ్డి, అకీల్ హుస్సేన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అబ్దుల్‌సమద్, మార్‌క్రమ్, త్రిపాఠీ, ఫిలిప్స్, అభిషేక్‌శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్