
సన్ రైజర్స్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా మార్క్రమ్ ను నియమిస్తున్నట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. మాయాంక్ అగర్వాల్ పేరు పరిశీలనలో ఉన్నా చివరికి దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మెగ్గు చూపింది. మార్క్రమ్ ఇటీవలే సౌత్ ఆఫ్రికా 20-20 లీగ్‌లో సన్ రైజర్స్ ఈస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వహించి టైటిల్ అందించిన విషయం తెలిసిందే.
2021లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన మార్క్రామ్ ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో ఆడాడు. అతను 40.54 సగటుతో 527 పరుగులు చేశాడు. ఐపిఎల్‌లో ఇప్పటివరకు మూడు అర్ధశతకాలు సాధించాడు.
సన్ రైజర్స్
మార్క్రమ్‌పై విశ్వాసం ఉంచిన సన్ రైజర్స్ యాజమాన్యం
మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌లో అతను జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
2016లో ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ 16 కోసం మినీ-వేలానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్‌రామ్, భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. అయినప్పటికీ, ఫ్రాంచైజీ మార్క్‌రామ్‌పై విశ్వాసం ఉంచింది. అతనికి జట్టు బాధ్యతలు తీసుకునే బాధ్యతను ఇచ్చింది.
2018లో వార్నర్ లేనప్పుడు ఆరెంజ్ ఆర్మీకి విలియమ్సన్ నాయకత్వం వహించాడు.